ఇషాన్ ప్రత్యేకత అదే.. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ స్వాన్ ప్రశంసలు
- ఆప్ఘన్‌పై రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్
- 79 బంతుల్లో 125 పరుగులు.. 14 ఫోర్లు, 7 సిక్సర్లతో వీరవిహారం
- శుభ్‌మన్ గిల్‌తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యం
- జట్టులో ఏ పాత్ర ఇచ్చినా పోషిస్తాడన్న గ్రేమ్ స్వాన్
- అసలు గ్యాప్ లేనట్లు ఆడాడని ప్రశంస
- బలహీనతను బలంగా మార్చుకున్నాడని వ్యాఖ్య
ఆఫ్ఘనిస్థాన్‌తో లక్నో వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇషాన్ కిషన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసలు కురిపించాడు. జట్టులోకి పునరాగమనం చేసినా.. అసలు ఏమాత్రం గ్యాప్ లేదన్నట్లుగా ఆడిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కేవలం 79 బంతుల్లోనే 125 పరుగులు చేసి భారత భారీ విజయానికి పునాది వేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154)తో కలిసి మూడో వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆఫ్ఘన్ బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టాడు. జియోస్టార్‌తో మాట్లాడిన స్వాన్.. ఇషాన్ జట్టుకు అవసరమైన పాత్రను ఎలాంటి అభ్యంతరం లేకుండా పోషిస్తాడని చెప్పాడు. ‘‘అతడికి ఏ బాధ్యత అప్పగించినా అంగీకరిస్తాడు. తిరిగి జట్టులోకి వచ్చి ఇంత ప్రభావం చూపడం నిజంగా గొప్ప విషయం’’ అని వ్యాఖ్యానించాడు.
ఇషాన్ ఇన్నింగ్స్ నిర్మించిన తీరు తనను మరింత ఆకట్టుకుందని స్వాన్ తెలిపాడు. తొలి అర్ధశతకాన్ని ఓపిగ్గా ఆడిన అతడు తర్వాత కేవలం 19 బంతుల్లోనే మరో 50 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేయడం అసాధారణమని అన్నాడు. అయితే అవి నిర్లక్ష్యంగా కొట్టిన షాట్లు కాదని, బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ సరైన బంతులను మాత్రమే బౌండరీలకు తరలించాడని వివరించాడు. తన బలహీనతలపై ఇషాన్ కష్టపడి పనిచేసి వాటినే బలంగా మార్చుకున్నాడని స్వాన్ ప్రశంసించాడు. అదే అతణ్ని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతోందని పేర్కొన్నాడు.
ఇషాన్-గిల్ జోడీ చెలరేగడంతో భారత్ 402 పరుగుల భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. అనంతరం భారత బౌలర్లు ఆఫ్ఘనిస్థాన్‌ను 232 పరుగులకే ఆలౌట్ చేసి 170 పరుగుల తేడాతో విజయం సాధించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.